బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమాతో టాలీవుడ్ కి హలో చెప్పబోతుందని మీడియాలో ఎప్పటినుండో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐతే, చిత్రబృందం నుండి మాత్రం ఈ విషయంపై ఎలాంటి స్పందన ఇప్పటివరకు రాలేదు.
కానీ, ఇప్పుడు ఆ సర్ప్రైజ్ రివీల్ అయ్యే టైం వచ్చేసింది. ఎందుకంటే, మార్చి 6న జాన్వీ పుట్టినరోజు. మరి, ఆ రోజునే జాన్వీ అభిమానులకు బిగ్ బర్త్ డే ట్రీట్ ని, తారక్ అభిమానులకు సాలిడ్ క్లారిటీ ఇవ్వాలని మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారట. హీరోయిన్ ని ఎనౌన్స్ చేసేందుకు ఒక స్పెషల్ వీడియోని కూడా విడుదల చెయ్యబోతున్నారట. మరి, ఇందుకోసమైతే, ఇరు స్టార్ల అభిమానుల్లో ఎక్జయిట్మెంట్ నెలకొంది.
పోతే, ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు కాగా, అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్త బ్యానర్ లు నిర్మిస్తున్నాయి.