మూవీ మావెరిక్ శంకర్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా RC 15. ఇంకా టైటిల్ ఖరారు కాబడని ఈ సినిమా నుండి ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ విడుదల కాలేదు.
మరి, ఇప్పుడైతే, RC 15 ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకాభిమానులను అలరించే టైం వచ్చేసిందని తెలుస్తుంది. ఎందుకంటే, మార్చి 27వ తేదీన రాంచరమ్ పుట్టినరోజు ఉంది. ఈ సందర్భంగా చరణ్ అభిమానులకు RC 15 టైటిల్ తో బిగ్ ట్రీట్ అందబోతుందని తెలుస్తుంది. మరైతే, ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ రావలసి ఉంది.
ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అంజలి, SJ సూర్య కీరోల్స్ లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.