సంక్రాంతికి వీరసింహారెడ్డి గా ప్రేక్షకులను పలకరించి, మెప్పించిన నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ బ్రేక్ లో ఉంది. మరి, ఈ నెల్లోనే ఒక మంచి రోజున షూటింగ్ పునఃప్రారంభం కానుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఈ ఏడాది దసరాకు విడుదల కాబోతుందని తెలుస్తుంది. దసరా విడుదలే లక్ష్యంగా మేకర్స్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నారట. మరి, ఈ విషయమై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ సినిమాలో శ్రీలీల క్రూషియల్ రోల్ లో నటిస్తుందని అధికారికంగా తెలుస్తుంది. మరి, బాలయ్య సరసన హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుందని ప్రచారం జరుగుతుంది.