ఇటీవల జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమంలో RRR 4 అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఐతే, వీటికన్నా, మెగాపవర్ స్టార్ రాంచరణ్ అందుకున్న HCA స్పాట్ లైట్ అవార్డు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే, తారక్, అభిమానులు HCA అఫీషియల్ ట్విట్టర్ ఖాతాని ట్యాగ్ చేసి, సంస్థపై ట్వీట్లతో విరుచుకుపడ్డారు. అందుకు సమాధానంగా HCA నుండి సాలిడ్ క్లారిటీ కూడా వచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం, అతి త్వరలోనే తారక్ కి HCA అవార్డులు చేరతాయి అని కన్ఫర్మేషన్ ఐతే వచ్చింది.
తాజాగా HCA చేసిన మరొక ట్వీట్ ను బట్టి ఆలియా భట్ కి కూడా HCA స్పాట్ లైట్ అవార్డు వచ్చిందని తెలుస్తుంది. తారక్ తో పాటు ఆమెకు కూడా HCA అవార్డులను చేరవేస్తున్నామని పేర్కొంటూ కొన్ని పిక్స్ ని HCA సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.