ఫస్ట్ సింగిల్ ఫాస్ట్ బీట్ మాస్ సాంగ్, సెకండ్ సింగిల్ మెలోడియస్ హార్ట్ బ్రేకింగ్ సాంగ్స్ .. ఇలా ఒక్కో పాటకు ఫుల్ వేరియేషన్ చూపిస్తున్న దసరా సినిమా నుండి తాజాగా మేకర్స్ థర్డ్ సింగిల్ ను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈసారి పాట ప్రతి పెళ్ళిలో మోత మోగిపోయే పాటలా ఉంటుందని... పేర్కొంటూ మార్చి 8న 'చెమ్కీల అంగీలేసి' అనే ఫోక్ మెలోడీని విడుదల చెయ్యబోతున్నట్టు అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు. ఇందులో నాని, కీర్తి స్కూటర్ పై ఎక్కడికో వెళ్తూ కనిపిస్తున్నారు.
మరి, ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీకి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈనెల 30న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.