మలయాళ సూపర్ హిట్ మూవీ 'కప్పేల' కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందిన చిత్రం "బుట్టబొమ్మ". ఈ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ అనిఖా సురేంద్రన్ హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యింది. గత నెలలో విడుదలైన ఈ సినిమాకు మంచి రివ్యూలు ఐతే వచ్చాయి కానీ, థియేటర్లలో ఎక్కువకాలం నిలవలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పేలవ ప్రదర్శన కనబరిచింది.
ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ ను అలరించేందుకు సిద్దమయ్యింది. మరి కాసేపట్లోనే అంటే, అర్ధరాత్రి 12 నుండి నెట్ ఫ్లిక్స్ లో బుట్టబొమ్మ డిజిటల్ సందడికి రెడీ అయ్యింది. మరి, అక్కడ బుట్టబొమ్మ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.
ఈ సినిమాకు శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ డైరెక్టర్ కాగా, అర్జున్ రామ్ దాస్, సూర్య వసిష్ఠ, నవ్య స్వామి కీరోల్స్ లో నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. గోపి సుందర్ సంగీతం అందించారు.