మాస్ రాజా రవితేజ గతేడాదిని "ధమాకా" బ్లాక్ బస్టర్ సక్సెస్ తో గ్రాండ్ గా ముగించారు. మరి, ఈ ఏడాది కూడా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకునేందుకు రవితేజ రెడీ అవుతున్నారు. ఆయన కొత్త సినిమా 'రావణాసుర' ఏప్రిల్ 7న విడుదల కావడానికి రెడీ అవుతుండగా, టైగర్ నాగేశ్వరరావు ఆల్రెడీ సెట్స్ పై ఉంది.
తాజాగా మాస్ రాజా చీరాల బీచ్ లో ఉదయం పూట వాకింగ్ చేస్తున్న పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే, ఈ పిక్స్ లో రవితేజ హెయిర్ స్టైల్ మెయిన్ హై లైట్ గా నిలిచింది. భుజాల వరకు ఉన్న జుట్టుతో టైగర్ నాగేశ్వర రావు కోసం విభిన్నంగా మేకోవర్ అయ్యాడంటూ ఫ్యాన్స్ ఇప్పటి నుండే సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు.