సంక్రాంతి బిగ్గీ 'వాల్తేరు వీరయ్య' నేటితో యాభై రోజుల సక్సెస్ఫుల్ థియేట్రికల్ రన్ జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్తూ ట్వీట్ చేసారు. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోలో అభిమానుల విజిల్స్, చప్పట్లు .. ఆ సందడి ఇప్పటికీ తన చెవుల్లో మారుమోగుతుందని తెలిపారు.
శృతి హాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.