బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన భార్య, పిల్లలను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. నడిరోడ్డుపై నిలబడి తమకు జరిగిన అన్యాయాన్ని వీడియో ద్వారా చెప్పుకొచ్చారు. నవాజ్ మమ్మల్ని అర్ధరాత్రి ఇంటి నుండి బయటకు తోసేశాడు. ఇద్దరు పిల్లలతో రోడ్డున పడ్డాను. నా దగ్గర రూ.81 ఉంది. ఇద్దరు పిల్లలతో ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. నిన్ను వదలను. నన్ను, నా బిడ్డలను రోడ్డు మీద పడేశావ్' అంటూ ఆమె చెప్పుకొచ్చింది.