డైరెక్టర్ బీవీ నందినిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆమె డైరెక్ట్ చేస్తున్న న్యూ మూవీ అన్నీ మంచి శకునములే టీజర్ విడుదల కాబోతుందన్న విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్ టీజర్ రిలీజ్ టైం పేర్కొంటూ BTS పిక్స్ ను విడుదల చేసారు. ఈ మేరకు సాయంత్రం ఆరింటికి టీజర్ విడుదల కాబోతుందని తెలుస్తుంది.
సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో గౌతమి, నరేష్, రాజేంద్రప్రసాద్, షావుకారు జానకీ, రావు రమేష్, వాసుకి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa