గ్లోబల్ సెన్సేషన్ RRR ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. RRR సినిమాలోని నాటు నాటు పాట ఈ ఏడాది జరగబోయే 95వ అకాడెమీ అవార్డులకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 12వ తేదీన లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ అకాడెమీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ RRR చిత్రబృందం రాజమోళి, రాంచరణ్, కీరవాణి తదితరులు USA లోనే ఉండి, RRR కి సంబంధించిన ప్రొమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
తారకరత్న మరణం కారణంగా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు rrr అమెరికా ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయారు. ఐతే, తాజాగా ఈ రోజు ఉదయం తారక్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో USA కి పయనమవుతూ కనిపించారు. సో, ఇకపై RRR త్రయాన్ని మనం ఆస్కార్ ప్రమోషన్స్ లో చూడవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa