కళ్యాణ్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ఘోస్టీ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నట్లు సమచారం. ఉగాది సందర్భంగా ఈ హారర్-కామెడీ సినిమా మార్చి 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
ఈ చిత్రంలో ప్రముఖ తమిళ హాస్యనటుడు యోగి బాబు, రాధికా శరత్‌కుమార్, కెఎస్ రవికుమార్ మరియు ఊర్వసి కూడా ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సీడ్ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది.