బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇటీవల నటించిన 'సెల్ఫీ' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, ఈ బాలీవుడ్ చిత్రం మార్చి 31, 2023న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమచారం. OTT ప్లాట్‌ఫారమ్ దీనికి సంబంధించిన ప్రకటన త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో డయానా పెంటీ మరియు నుష్రత్ భరుచ్చా కథానాయికలుగా నటించారు. ధర్మ ప్రొడక్షన్స్ మరియు అక్షయ్ కుమార్ యొక్క కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ మరియు సుకుమారన్ యొక్క పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ మరియు మ్యాజిక్ ఫ్రేమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa