రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రమైంది. గురువారం రాత్రి రష్యా డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో ఉక్రెయిన్‌పై పెద్ద ఎత్తున దాడి చేసింది. ఈ దాడుల్లో ప్రాణనష్టం లేనప్పటికీ, పదుల సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా పిల్లలు గాయపడ్డారు. రైల్వే, ఎనర్జీ సెక్టార్‌లను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడుల్లో భవనాలు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ, 420 డ్రోన్లు, 39 మిస్సైల్స్, 11 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించబడ్డాయని, వాటిలో చాలా వరకు గాలిలోనే ధ్వంసం చేశామని తెలిపారు. కొన్ని ఉక్రెయిన్ భూభాగాలను తాకినట్లు ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa