స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం "భోళా శంకర్". కోలీవుడ్ సూపర్ హిట్ చిత్రం "వేదాళం" కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు లీడ్ రోల్ లో నటిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. మరొక హీరోయిన్ కీర్తి సురేష్ మెగాస్టార్ కి చెల్లెలిగా నటిస్తున్న విషయం తెలిసిందే.
అక్కినేని హీరో సుశాంత్ భోళా శంకర్ లో కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ గా నటించబోతున్నట్టు రీసెంట్గా ప్రచారం జరిగింది. నిన్న సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా భోళా శంకర్ చిత్రబృందం నుండి ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ వచ్చింది. హ్యాండ్సమ్ లవ్ బాయ్ తరహాలో ఉండే పాత్రలో సుశాంత్ ఈ సినిమాలో నటించబోతున్నట్టు తెలుపుతూ, ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.