ఈ ఉగాదికి సందడి చేయడానికి మరికొన్ని సినిమాలు థియేటర్లకు వచ్చేస్తున్నాయి. ఇటీవల మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలిచిన చిత్రం దాస్ కా ధమ్కీ. విశ్వక్‌సేన్ తానే హీరో, డైరెక్టర్ గా చేసిన చిత్రమిది. ఈ సినిమా 22న విడుదలవుతోంది. అలాగే డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన లేటేస్ట్ చిత్రం రంగమార్తాండ, ఆదర్శ్, చిత్ర శుక్ల జంటగా నటించిన గీత సాక్షిగా, కాజల్ నటించిన కోస్టి సినిమా సైతం అదే రోజున రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ ముందు గెలిచి నిలిచే సినిమా ఏదో చూడాలి మరి.