క్రేజీ హీరోయిన్ సమంతకు జిమ్ లో కఠిన వర్కౌట్లు చెయ్యడం అంటే ఎంత పిచ్చో అందరికీ తెలుసు. ఆ మధ్య మాయోసైటిస్ కారణంగా తనకిష్టమైన జిమ్ కి దూరంగా ఉన్న సమంత మళ్ళీ ఈ మధ్యనే జిమ్ లో కఠిన కసరత్తులు మొదలెట్టింది.
తాజాగా ఈ రోజు మండే మోటివేషన్ పోస్ట్ తరహాలో జిమ్ లో కఠిన కసరత్తులు చేస్తున్న పిక్ ని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పిక్ కి నెటిజన్లు, కొంతమంది సెలెబ్రిటీలు తమదైన స్టయిల్ లో కామెంట్ చేస్తున్నారు.
ఈ ఏడాది సమంత "శాకుంతలం" మైథలాజికల్ ఎపిక్ లవ్ స్టోరీ తో ప్రేక్షకులను పలకరించబోతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 14న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.