టాలీవుడ్ స్టార్ హీరో నితిన్, నేషనల్ క్రష్ రష్మిక మండన్నా జంటగా, ఛలో ఫేమ్ వెంకీ కుడుముల రూపొందించిన రొమాంటిక్ కామెడీ ఫిలిం 'భీష్మ'. 2020లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ కమర్షియల్ సక్సెస్ సాధించింది.
భీష్మ త్రయం మరొకసారి కలవబోతుందని, వెంకీ కుడుముల డైరెక్షన్ లో నితిన్, రష్మిక మండన్నా జంటగా మరొక క్రేజీ మూవీ రూపొందబోతుందని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ మూవీ యొక్క అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మార్చి 24న అంటే ఈ వారంలోనే జరగబోతుందని టాక్ నడుస్తుంది. నెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుందంట. మరి, ఈ విషయాలపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఈ సినిమాను టాలీవుడ్ హిట్ సినిమాల ఫ్యాక్టరీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతుందంట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa