విక్టరీ వెంకటేష్, హిట్ ఫ్రాంచైజీ తో సూపర్ హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను కలయికలో "సైంధవ్" అనే ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా నుండి తాజాగా ఈ రోజు ఉగాది పండుగను పురస్కరించుకుని మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. మార్చి 23 అంటే రేపటి నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందని స్పెషల్ పోస్టర్ తో తెలిపారు.
నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కీరోల్ లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa