సుహాస్, టీనా శిల్పరాజ్ జంటగా నటించిన 'రైటర్ పద్మభూషణ్' మూవీ ఇటీవలే విడుదలై, ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. జి. మనోహరన్ సమర్పణలో లహరి ఫిలిమ్స్, చాయ్ బిస్కట్ ఫిలిమ్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ ఈ సినిమాను నిర్మించారు.
లేటెస్ట్ గా రైటర్ మేకర్స్ నుండి ఒక కొత్త మూవీ ఎనౌన్స్మెంట్ జరిగింది. 'మేం ఫేమస్' అనే టైటిల్ తో విడుదలైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను బట్టి ఈ సినిమా ఒక విలేజ్ ఫన్, లవ్, ఫ్రెండ్షిప్ స్టోరీగా ఉండబోతుందని తెలుస్తుంది. సుమంత్ ప్రభాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూన్ 2న విడుదల కాబోతుంది. కళ్యాణ్ నాయక్ సంగీతం అందిస్తున్నారు.