ధనుష్, సంయుక్త మీనన్ జంటగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఫీల్ గుడ్ సోషల్ మెసేజ్ డ్రామా "సార్". తమిళంలో "వాతి". ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా థియేటర్ ఆడియన్స్ ను, క్రిటిక్స్ ని విశేషంగా మెప్పించి, ప్రపంచవ్యాప్తంగా 100కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
రీసెంట్గానే తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా అక్కడ కూడా భారీ స్పందన అందుకుంటుంది. మార్చి 13-19 తేదీలలో నెట్ ఫ్లిక్స్ విడుదల చేసిన గ్లోబల్ ఛార్ట్స్ లో నాన్ ఇంగ్లిష్ సినిమాల లిస్టులో సార్ టాప్ టెన్త్ పొజిషన్ లో ఉండగా, వాతి టాప్ 9 పొజిషన్లో ట్రెండ్ అవుతుంది.