ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యంగ్ హీరోకి ఛాన్స్ ఇస్తున్న సుకుమార్

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 02, 2019, 09:08 PM

స్టార్ డైరెక్టర్ సుకుమార్ అటు సినిమాలు తీస్తూనే మరోపక్క చిన్న సినిమాలను కూడా నిర్మిస్తున్నారు ఈ మధ్య. సుకుమార్‌ రైటింగ్స్‌ను స్థాపించి తన వద్ద పనిచేస్తున్న అసిస్టెంట్‌ డైరెక్టర్లను డైరెక్టర్లుగా మార్చేస్తున్నారు. తాజాగా ఈ సంస్థ నుంచి మరో ప్రాజెక్ట్‌ ఖరారైంది.
సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై సుకుమార్, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్ శ‌ర‌త్ మ‌రార్ క‌ల‌యిక‌లో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోగా నాగశౌర్య ఎంపికైనట్టు తెలుస్తోంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేస్తున్న కాశీ విశాల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నున్నట్టు తెలుస్తోంది. మరి ఛలో సినిమాతో సందడి చేసిన నాగశౌర్యకు మళ్లీ ఆ రేంజ్‌లో సక్సెస్‌ లభించలేదు. ఈ సినిమాతోనైనా మళ్లీ మంచి సక్సెస్ అందుకుంటాడో? లేదో? చూద్దాం..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa