కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తన తదుపరి సినిమాని తలపతి విజయ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'లియో' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. విజయ్ సరసన ఈ సినిమాలో త్రిష జోడిగా నటిస్తుంది. లియో అక్టోబర్ 19, 2023న సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది.
ఇటీవల కాశ్మీర్ షెడ్యూల్‌ను ముగించుకుని మూవీ టీమ్ చెన్నైకి తిరిగి వచ్చారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా కొత్త షెడ్యూల్ మార్చి 29, 2023 న చెన్నైలో ప్రారంభమవుతుందని మరియు 17 రోజుల పాటు కొనసాగుతుందని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం మూవీ టీమ్ హైదరాబాద్ వెళ్లనుంది.
ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ మరియు డ్యాన్స్ మాస్టర్ శాండీ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మించనుంది.