జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టిన వేణు ఎల్దండి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే దర్శకుడిగా మారాడు. వేణు డెబ్యూ దర్శకుడిగా తెరకెక్కించిన బలగం చిత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఘనవిజయం సాధించింది.జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టిన వేణు ఎల్దండి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే దర్శకుడిగా మారాడు. వేణు డెబ్యూ దర్శకుడిగా తెరకెక్కించిన బలగం చిత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఘనవిజయం సాధించింది. వేణు దర్శకత్వ ప్రతిభకి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంలో నటుడు ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. ప్రస్తుతం వేణు బలగం చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో మనసుని హత్తుకునే భావోద్వేగాలతో వేణు ఈ చిత్రాన్ని ఎంతో చక్కగా తెరకెక్కించారు. జబర్దస్త్ లో టీం లీడర్ గా స్కిట్ లు చేస్తూ అలరించిన వేణు.. సినిమాల్లో కూడా కమెడియన్ గా అప్పుడప్పుడూ మెరిశాడు. ఇదిలా ఉండగా నేడు వేణు కొండగట్టులో ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. బలగం చిత్రం విజయం సాధించిన కారణంగా వేణు అక్కడ కొండగట్టు అంజన్నకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆ దృశ్యాలని వేణు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
![]() |
![]() |