హాలీవుడ్ బ్లాక్ బస్టర్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ థియేట్రికల్ విడుదలైన నాలుగు నెలల తర్వాత డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. సంచలన దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ మాగ్నమ్ ఓపస్ ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ చిత్రంగా నిలిచింది.
తాజాగా ఇప్పుడు, ఈ సినిమా భారతదేశంలోని ఐట్యూన్స్, గూగుల్ ప్లే మరియు యూట్యూబ్ లో రెంటల్ బేస్ పై డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో కి వచ్చింది. ఈ చిత్రం ఏప్రిల్ 28, 2023న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది.
అవతార్ 2లో సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, కేట్ విన్స్లెట్, స్టీఫెన్ లాంగ్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. జేమ్స్ కామెరూన్ మరియు జోన్ లాండౌ నిర్మించిన ఈ చిత్రానికి సైమన్ ఫ్రాగ్లెన్ సంగీతం అందించారు.