బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మపై బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.మహారాష్ట్ర సేల్స్ ట్యాక్స్ అధికారులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ బాలీవుడ్ నటి దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు గురువారం కొట్టివేసింది.ఇదిలా ఉండగా, మహారాష్ట్ర వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (ఎంవీఏటీ) చట్టం కింద 2012 నుంచి 2016 ఆర్థిక సంవత్సరంలో బకాయి ఉన్న పన్నులను చెల్లించాల్సిందిగా సేల్స్ ట్యాక్స్ అధికారులు అనుష్కకు నోటీసులు జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ నటి బాంబే హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలు చేసింది. జస్టిస్ నితిన్ జామ్దార్, అభయ్ అహుజాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.