దశాబ్ధాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీని రారాజులా ఏలుతున్న సల్మాన్‌ను గత రెండేళ్లుగా వరుస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. నిజానికి గతేడాది సల్మాన్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ ముందటి ఏడాది రెండు సినిమాలు విడుదల కాగా.. రెండూ నిర్మాతలకు తేరుకోని నష్టాల్ని మిగిల్చాయి. దాంతో సల్మాన్ కొంచెం గ్యాప్ తీసుకుని రెండు సినిమాలతో అభిమానులలో ఉత్సాహం నింపడానికి రెడీ అయ్యాడు. సల్మాన్ ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్‌మీద ఉంచాడు. అందులో ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ ఒకటి. ఈద్ సందర్భంగా ఏప్రిల్ 4న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. పైగా వెంకీ కీలకపాత్ర పోషించనుండటంతో తెలుగులోనూ విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.
#Bathukamma song out now.https://t.co/IiO4pyUvrq@hegdepooja @VenkyMama @farhad_samji @RaviBasrur @santoshvenky #AiraaAcharyaUdupi @hariniivaturi #SuchethaBasrur #VijayalaxmiMettinahole @Musicshabbir @AlwaysJani
— Salman Khan (@BeingSalmanKhan) March 31, 2023