నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా భారీ పాన్ ఇండియా మాస్ చిత్రం "దసరా". అయితే ఈ సినిమా భారీ ఎత్తున విడుదలై కలెక్షన్లు కూడా ఊహించినంతగా రికార్డు స్థాయిలో నమోదు చేస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఆల్రెడీ నైజాం లో సాలిడ్ వసూళ్లు అందుకున్న ఈ సినిమా లేటెస్ట్ గా తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు కూడా నైజాం లో సెన్సేషనల్ స్టార్ట్ తో మొదలైనట్టుగా తెలుస్తుంది. పి ఆర్ నంబర్స్ ప్రకారం దసరా రెండో రోజు నైజాం లో 3.48 కోట్లు షేర్ ని రాబట్టింది. దీనితో రెండు రోజుల్లోనే ఈ చిత్రం 10 కోట్ల షేర్ మార్క్ ని దాటేసి టైర్ 2 హీరోస్ లో బిగ్గెస్ట్ రికార్డ్స్ సెట్ చేస్తుంది.