ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తంగలన్‌' షూటింగ్ లో జాయిన్ అయ్యిన చియాన్ విక్రమ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 01, 2023, 07:02 PM

దర్శకుడు పా రంజిత్‌తో స్టార్ హీరో విక్రమ్ 'తంగలన్' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. తాజా సమాచారం ప్రకారం, విక్రమ్ తంగలన్ షూటింగ్ కోసం KGFలో జాయిన్ అయ్యినట్లు సమాచారం. ప్రస్తుతం కేజీఎఫ్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ విషయాని స్టార్ హీరో విక్రమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వెల్లడించారు.

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ మరియు పార్వతి తిరువోతు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో డేనియల్ కాల్టాగిరోన్, పశుపతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com