ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృతికా అగ‌ర్వాల్ పాత్ర‌లో తాప్సీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 04, 2019, 12:24 PM

బాలీవుడ్‌ నటులు అక్షయ్‌ కుమార్, విద్యా బాలన్‌, తాప్సీ, సోనాక్షి సిన్హా, నిత్యా మీనన్‌, కీర్తి కుల్హరి, షర్మన్ జోషి తదితరులు న‌టిస్తున్న బాలీవుడ్ తొలి స్పేస్ మూవీ మిష‌న్ మంగ‌ళ్.. 2013లో భారత్‌ చేపట్టిన మంగళ్ యాన్‌‌ మిషన్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌, కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిలింస్ బ్యాన‌ర్ పై ద‌ర్శ‌కుడు జ‌గ‌న్ శ‌క్తి ఈ మూవీని రూపొందిస్తున్నాడు.. ఈ మూవీలో కృతికా అగ‌ర్వాల్ పాత్ర‌లో తాప్సీ న‌టిస్తున్న‌ది.. ఇప్ప‌టికే ఆమె పాత్ర షూటింగ్ పూరి అయింది..ఈ నేప‌థ్యంలో తాప్పీ ఈ పాత్ర స్టిల్ ను త‌న సోష‌ల్ మీడియా ద్వారా రివీల్ చేసింది. ‘మరో అందమైన ప్రయాణం ముగిసింది. ‘మిషన్‌ మంగళ్‌’ సినిమాకు సంబంధించిన నా పాత్ర చిత్రీకరణ పూర్తైంది.. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లో అద్భుతమైన నటులు ఉన్నారు. ‘మిషన్‌ మంగళ్‌’ను చిరకాలం గుర్తుపెట్టుకుంటాను. ఆగస్ట్‌ 15న ఈ చిత్రాన్ని సెలబ్రేట్‌ చేసుకుందాం’ అని వ్యాఖ్యానించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa