శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన "దసరా" సినిమా మార్చి 30, 2023న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదల అయ్యిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజాగా ఇప్పుడు, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ఈ సినిమా విజయోత్సవ వేడుకలను ఏప్రిల్ 5, 2023న SRR గవర్నమెంట్ ఆర్ట్స్‌లో నిర్వహించనున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ జోడిగా నటిస్తుంది. యాక్షన్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, పూర్ణ, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa