టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన తదుపరి ప్రాజెక్ట్ ని దర్శకుడు విజయ్ కనకమేడలతో అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి 'ఉగ్రం' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా జోడిగా నటిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సినీప్రేమికులలో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.
ఈ చిత్రం వాస్తవానికి ఏప్రిల్ 14, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కొన్ని తెలియని కారణాల వల్ల ఈ సినిమా మే 5, 2023న విడుదల కానుంది అని మూవీ టీమ్ అధికారకంగా ప్రకటించింది. విడుదల తేదీతో కూడిన ఒక స్పెషల్ పోస్టర్ ని కూడా మూవీ టీమ్ విడుదల చేసింది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa