ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'VS11'లో విశ్వక్సేన్ తో రొమాన్స్ చేయనున్న రాధికా, అంజలి

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 05, 2023, 06:52 PM

కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన తదుపరి చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'VS 11' అని తాత్కాలికంగా పేరు పెట్టారు. తాజాగా ఈ సినిమా కోసం మేకర్స్ ఇద్దరు హీరోయిన్లను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నట్లు సమాచారం. దీనిపై మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో రాజమండ్రిలో ప్రారంభం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa