షారుఖ్ ఖాన్, రాణీ ముఖర్జీ నటించిన సినిమాలు ఎక్కువగా యూత్ ను ఆకర్షించాయి. తాజగా రాణీ ముఖర్జీ నటించిన 'మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే' సినిమాను అభినందిస్తూ షారుఖ్ ట్వీట్ చేశారు. అయితే రాణీ ముఖర్జీ ఇటీవల షారుఖ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు 80 ఏళ్ల వయసు వచ్చినా షారుఖ్ తో లవ్ స్టోరీ సినిమాలతో పాటు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నానని రాణీ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.