హాట్ లుక్స్ తో పాటు ఆకట్టుకునే అభినయం నివేతా పేతురాజ్ సొంతం. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేతా 2016లో తమిళ చిత్రంతో హీరోయిన్ గా మారింది. నివేతా పేతురాజ్ నటించిన తొలి తెలుగు చిత్రం 'మెంటల్ మదిలో'. నివేతా గ్లామర్ రోల్స్ తో పాటు.. ఛాలెంజింగ్ పాత్రలో కూడా మెప్పించగలగడం ఆమె ప్రత్యేకత. ఆ తర్వాత నివేతా చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. రామ్ రెడ్ మూవీలో కూడా మెరిసింది. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తాజాగా నివేతా పేతురాజ్ చురకత్తుల్లాంటి చూపులతో ఫోజులు ఇచ్చింది. బబ్లీ లుక్స్ తో కట్టి పడేస్తూనే హాట్ నెస్ తో ఉడికిస్తోంది. నివేత పేతురాజ్ ఈ ఫొటోలతో గ్లామర్ ప్రియులకు మంచి ట్రీట్ ఇస్తోంది. ఆమె నిండైన డ్రెస్ ధరించినప్పటికీ నివేతా అందం కుర్రాళ్ళని కట్టి పడేసే విధంగా ఉంది.
Beautiful Nivetha Pethuraj #NivethaPethuraj pic.twitter.com/m8FDRSJPGc
— AS (@CricSamraj) April 8, 2023