ఆర్య 2, మరో చరిత్ర, నాగవల్లితో పాటు తెలుగులో పలు సినిమాలు చేసినా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది శ్రద్ధాదాస్. పరాజయాల కారణంగా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో దాదాపు మూడేళ్లుగా టాలీవుడ్‌కు దూరమైన శ్రద్ధాదాస్ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నది. కమెడియన్ సునీల్‌తో సినిమా చేయబోతున్నది.ఈ సినిమాకు పారిజాత పర్వం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సోమవారం టైటిల్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ముసుగు ధరించిన ఓ అమ్మాయి కట్టేసి ఉండటం ఆసక్తిని పంచుతోంది.
ట్రెడిషనల్ లుక్‌లో ఆ యువతి కనిపిస్తోంది. ఈ సినిమాలో సునీల్, శ్రద్ధాదాస్ తో పాటు చైతన్యరావు, మాళవికా సతీషన్ కీలక పాత్రల్ని పోషిస్తోన్నారు. ఫన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీకి సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహిస్తోన్నాడు.తెలుగులో ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే కనిపించింది శ్రద్ధాదాస్. పారిజాత పర్వం సినిమాలో కంప్లీట్‌గా ట్రెడిషనల్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాతోనైనా శ్రద్ధాదాస్ సక్సెస్ అందుకుంటుందా లేదా అన్నది త్వరలోనే డిసైడ్ కానుంది.ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతోన్నాయి. మరోవైపు తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ సునీల్ బిజీగా ఉన్నాడు.