మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన అందమైన ప్రేమకథ ‘సీతా రామం’. ఈ సినిమా సీక్వెల్‌పై మృణాల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చిట్‌చాట్‌లో భాగంగా ఓ అభిమాని ‘సీతా రామం-2’ ఉంటుందా అని మృణాల్‌ను అడిగారు. దీనికి ఆమె స్పందిస్తూ, ‘‘సీతారామం’ నిజంగా అద్భుతమైన చిత్రం. ఈ సినిమా సీక్వెల్ గురించి నాకు ఇంత వరకు సమాచారం లేదు. కానీ, పార్ట్-2 కోసం ఎదురుచూస్తున్నాను’’ అని చెప్పారు.