దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కి బ్యూటీ తమన్నా హీరోయిన్ గా తెరకెక్కిస్తున్న చిత్రం “భోళా శంకర్”. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మేకర్స్ కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమాకు ఇంకా నెల రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి ఆగస్ట్ రిలీజ్ కి రెడీ అవుతుంది.