రైటర్ పద్మభూషణ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన తర్వాత లహరి ఫిల్మ్స్ మరియు చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి 'మేమ్ ఫేమస్' అనే ఆసక్తికరమైన చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సారయ మరియు సిరి రాసి ఇతరలు ఈ సినిమాలో కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూన్ 2, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ రోజు మూవీ మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ అప్‌డేట్‌ను విడుదల చేశారు. రైటర్ పద్మభూషణ్‌కి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన కళ్యాణ్ నాయక్ ఈ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ మేమ్ ఫేమస్ కోసం 9 పాటలను కంపోజ్ చేసినట్లు సమచారం. నాటు నాటు సాంగ్ ని పడిన కాల భైరవ మరియు రాహుల్ సిప్లిగంజ్ ఈ సినిమాలో ఒక పాటను పాడగా, మంగ్లీ మరో పాటకు తన గాత్రాణి అందించింది. ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేసే తేదీని మూవీ మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa