మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన దసరా సినిమా భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన పది రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా చూసిన చిరు.. “డియర్ నాని.. దసరా సినిమా చూశాను. నీ నటన చాలా అద్భుతంగా ఉంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పనితీరు చాలా బాగుంది. మాహానటి కీర్తి సురేష్ యాక్టింగ్ అదిరిపోయింది. దీక్షిత్ శెట్టి తన పాత్రకు న్యాయం చేశాడు. నారాయణన్ సంగీతం అదిరిపోయింది" అని కితాబుచ్చారు.