సూపర్ హిట్ మూవీ 'సర్దార్' లో చివరిసారిగా కనిపించిన బబ్లీ నటి రాశి ఖన్నా ఆ తర్వాత బాలీవుడ్ మూవీ 'యోధా'లో కనిపించనుంది. సిద్ధార్థ్ మల్హోత్రా మరియు దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సాగర్ అంబ్రే మరియు పుష్కర్ ఓజా దర్శకత్వం వహించారు. తాజాగా ఇప్పుడు, రాశి ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో యోధాలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి ముంబైలో ఉన్నట్లు స్టోరీ ని షేర్ చేసింది. ధర్మ ప్రొడక్షన్స్ క్రింద కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రం జూలై 7, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.