నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా 'దసరా'. ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమా మే30 నుండి ప్రముఖ ఓటిటి సంస్థ 'నెట్‌ఫ్లిక్స్'లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ప్రసారం కానుంది. హిందీ స్ట్రీమింగ్ హక్కులను హాట్ స్టార్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa