టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న క్రేజే వేరు. అందుకే ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్ విగ్రహానికి చోటు దక్కింది. ప్రస్తుతం సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్ మైనపు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. త్వరలోనే ఈ విగ్రహం హైదరాబాద్ కు రానుంది.
మహేశ్ బాబు భాగస్వామిగా ఇటీవల ప్రారంభమైన ఏఎంబీ సినిమాస్ మల్టిప్లెక్స్ లో ఈ మైనపు విగ్రహాన్ని అభిమానుల కోసం ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ నెల చివరిలో మహేశ్ మైనపు విగ్రహాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చి, ఆ తర్వాత లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రధాన కార్యాలయానికి తరలిస్తామని మ్యూజియం వర్గాలు తెలిపాయి. విగ్రహాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa