ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT ప్రీమియర్ తేదీని ఖరారు చేసిన సోనాక్షి సిన్హా తొలి వెబ్ సిరీస్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 21, 2023, 06:42 PM

రీమా కగ్తీ మరియు రుచికా ఒబెరాయ్ దర్శకత్వంలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన తొలి OTT సిరీస్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. రీమా కగ్తీ మరియు జోయా అక్తర్ రూపొందించిన ఈ హిందీ సిరీస్‌కి 'దహాద్' అనే టైటిల్ ని లాక్ చేసారు. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గర్జించే రెస్పాన్స్ పొందిన ఈ వెబ్ సిరీస్ ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 12, 2023న ప్రీమియర్‌ను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. అదే విషయాన్ని ప్రకటించడానికి మూవీ మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో సోనాక్షి సిన్హా పోలీసుగా నటించింది. గుల్షన్ దేవయ్య, విజయ్ వర్మ, సోహమ్ షా ఈ సిరీస్ లో కీలక పాత్రలు పోషించారు. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు టైగర్ బేబీ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సిరీస్‌కి గౌరవ్ రైనా మరియు తరానా మార్వా సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa