కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెహరీన్ కెరీర్‌లో ఆశించిన వేగం లోపించింది. మలి విడత వచ్చిన అవకాశాలు నిరాశపరిచాయి. ముఖ్యంగా మహానుభావుడు, కవచం, నోటా చిత్రాల పరాజయం అమె కెరీర్ ప్రశ్నార్థకంగా మార్చివేశాయి. ఈ సమయంలో వచ్చిన అవకాశం మళ్లి పుంజుకునేలా చేసింది. అదే ఎఫ్ 2 సినిమా. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో వరుణ్‌కు జోడిగా నటించింది. తమన్నా మరో హీరోయిన్. కానీ సినిమా మొత్తంలో హైలెట్‌గా నిలిచింది మాత్రం మెహరిన్ ధరించిన పాత్ర కావడం విశేషం. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో మెహరిన్‌కు కలిసివచ్చింది. ఇదే ఆమెకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతోంది అని సినీ వర్గాలు అంటున్నాయి. హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ మెహరిన్ చెప్పిన డైలాగ్ కుర్రాళ్లకి తెగనచ్చేసింది. కేవలం ఒక సినిమా తన కెరీర్‌ను మార్చేసిందని మెహరీన్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa