ఏదైనా మాట్లాడేముందు కాస్త ఆలోచించుకోవాలి.. లేదంటే తర్వాత లేనిపోని ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు సాక్షి చౌదరిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. తెలిసీ తెలియకుండా ఓ మాట అనేసి ఇప్పుడు నానా తంటాలు పడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్యే ఈ భామ తనను తాను ఎక్కువగా ఊహించేసుకుని హాట్ కామెంట్స్ చేసింది. తనకు ఒక్క రాత్రికి కోటి ఇస్తామంటున్నారంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది సాక్షి. మనోజ్ పోటుగాడులో ప్యార్ మే పడిపోయానే అంటూ సాంగేసుకున్న ముద్దుగుమ్మ గుర్తుంది కదా.. ఆ భామే సాక్షి చౌదరి.
ఈమె చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు కూడా బాగా ఆడుకున్నారు. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు ఈ కామెంట్స్ తర్వాత అమ్మడు బయటికి రావడం మానేసింది. సినిమాల్లో అవకాశాలు రాకపోయేసరికి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగానే ఎప్పుడూ హాట్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది ఈ భామ. ఇక ఇప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది సాక్షి చౌదరి. తనకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎక్కువైపోయారని.. తన ఫోటోలు చూసి పండగ చేసుకుంటున్నారంటూ కామెంట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
అక్కడితో ఆగిపోతే బాగున్ను కానీ తనకు ఒక్క రాత్రికి ఏకంగా కోటి రూపాయలు ఇస్తామంటూ కొందరు ఆఫర్ ఇస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ భామ. దీని తర్వాత మొన్న సువర్ణ సుందరి సినిమా ఆడియో వేడుకలో కూడా కనిపించలేదు సాక్షి చౌదరి. దీనికి కారణం కూడా ఈమె కామెంట్సే. కనిపిస్తే ఎక్కడ ఆడుకుంటారేమో అని భయంతో మొహం చాటేసింది ఈ ముద్దుగుమ్మ. అయినా అనే ముందు ఉండాలి కానీ ఇప్పుడు జాగ్రత్త పడి మాత్రం ఏం లాభం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa