విక్టరీ వెంకటేష్ ఇంట పెళ్లి బాజా మోనుంది. ఆయన కూతురు ఆశ్రిత హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. ఈ విషయం ఇంట్లో చెప్పగా వాళ్ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. తాజాగా అశ్రిత ఎంగేజ్‌మెంట్ బుధవారం సాయంత్రం సీక్రెట్‌గా జరిగినట్టు సమాచారం. ఈ కార్యక్రమానికి కేవలం సన్నిహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు మాత్రమే హాజరయ్యారని అంటున్నారు. ఇక వివాహానికి ముహూర్తం మార్చి 1న ఫిక్స్ చేశారని టాక్. మరి ఈ వార్తలపై దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించి ఎవరైన స్పందిస్తారేమో చూడాలి మరి. అయితే వెంకీ కూతురు అశ్రిత బేకరీ బిజినెస్ చేస్తోంది. ఇప్పటికే సిటీలో కొన్ని స్టాల్స్ కూడా నడిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa