ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'మార్క్ ఆంటోని' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు, ఈ సినిమా యొక్క డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ రెండింటినీ భారీ మొత్తానికి ZEE సంస్థ సొంతం చేసుకున్నట్లు తాజా సమాచారం.
ఈ చిత్రంలో విశాల్ సరసన రీతూ వర్మ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో ఎస్ జె సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మినీ స్టూడియోస్ బ్యానర్‌పై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు.