సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని 'ఏజెంట్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందిన సంగతి మూవీ మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. తాజాగా ఇప్పుడు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాలో ఎనిమిది అభ్యంతరాలను లేవనెత్తింది. రెగ్యులేటరీ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా సినిమాలోని కొన్ని కస్ పదాలు మ్యూట్ చేయబడ్డాయి. అంతేకాకుండా ప్రేక్షకులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేందుకు రెండు హింసాత్మక సన్నివేశాలను బ్లాక్ చేసారు.
స్పై థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుంది. ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏప్రిల్ 28, 2023న విడుదలకు సిద్ధంగా ఉంది.
ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు.