స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా తన జీవితంలో ఎదుర్కొన్న క్లిష్టమైన సంఘటనల గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. హైస్కూల్ విద్య కోసం అమెరికాకు వెళ్లిన కొత్తలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. స్కూల్‌లో వెండింగ్ మిషన్ నుంచి తెచ్చుకున్న స్నాక్స్‌ని ఎవరూ చూడకుండా బాత్‌రూమ్‌లోకి వెళ్లి తినేదాన్నని, అలా చాలా రోజులపాటు వేరే వాళ్లతో కలిసి తిరగలేదని చెప్పారు. ఆ తర్వాత ధైర్యం పెరిగి అందరితో కలిసిపోయానని చెప్పుకొచ్చారు.